పునర్నిర్మాణానికి సహకరించాలి
కాగజ్‌నగర్ టౌన్: వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీరామచంద్ర జీయర్‌స్వామి సూచించారు. శనివారం కాగజ్‌నగర్ పట్ట ణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రామచంద్ర జీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో గోదాదేవి, లక్ష్మి అమ్మవార్లతో పాటు వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు, వ్యాపారులు పాల్గొన్నారు.


