పులి సంచారంపై అవగాహన
తిర్యాణి: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం మండలంలోని మొర్రి గూడ, కొత్తగూడ, లోహా గ్రామాల్లో అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి ఫేస్ మాస్కులు, విజిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్కు పెట్టుకోవాలని, అవసరాన్ని బట్టి విజి ల్ ఉపయోగించాలని సూచించారు. రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో అటవీప్రాంతం వైపునకు వెళ్లవద్దని తెలిపారు. పత్తి చేన్లకు గుంపులుగుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎఫ్‌ఎస్వో ఉజ్వ ల్, బీట్ అధికారి శ్రీకాంత్ తదితరులున్నారు.


