పౌష్టికాహారం అందించాలి
వాంకిడి: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి సూచించారు. శనివారం మండలంలోని ఖమాన గ్రామంలోగల ప్రభుత్వ ప్రా థమికోన్నత పాఠశాలను సందర్శించారు. మ ధ్యాహ్న భోజనం, బోధన విధానం, హాజరు పట్టిక, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో సులభ పద్ధతిలో బోధించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అ నంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.


