ఉన్నతవిద్య అభ్యసించేలా ప్రోత్సహించాలి
కాగజ్‌నగర్ రూరల్: షెడ్యూల్ కులాల విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. శనివారం కాగజ్‌నగర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతిగృహా లను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఈడీ సురేశ్‌కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికా రి సత్యజిత్ మండల్‌తో కలిసి సందర్శించారు. అ నంతరం విద్యార్థుల సంక్షేమ, వసతి గృహాల సదుపాయాలు, విద్యాప్రమాణాలపై అధికారులతో స మీక్షించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రొత్సహించాలని సూచించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. దళిత, అణగారిన వర్గాల సంక్షేమానికి కమి షన్ కృషి చేస్తోందని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యే హరీశ్‌బాబు తదితరులున్నారు.


