కలెక్టరేట్ ఎదుట రైతుల మహాధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట పత్తి రైతులు మహాధర్నా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ హాజరై రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తేమ శాతం పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, కపాస్ కిసాన్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలును చేయాలని కోరారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం వెంటనే చెల్లించాలని, క్వింటాల్ పత్తికి రూ.12వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసేలా యజమానులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. బయటి మా ర్కెట్‌లో కాంటాలు పెట్టి అమాయక రైతుల వద్ద త క్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్న దళారులపై క ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు రై తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులా ట జరిగింది. దీంతో కలెక్టరేట్ ఎదుటనే బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు హక్కుల పోరాట సమితి జేఏసీ నాయకులు రూప్ నార్ రమేశ్, జయరాం, కేశవ్‌రావ్, ప్రణయ్, అలీబి న్ అహ్మద్, జక్కయ్య, శంకర్, నారాయణ, అంజ న్న, తిరుపతి, దత్తు, సందీప్ తదితరులున్నారు.


