బిర్సా ముండా మహనీయుడు
ఆసిఫాబాద్: బిర్సా ముండా మహనీయుడని, అత డి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్ర దేడియాపాడ నుంచి జనజాతీయ గౌరవ దివస్ వే డుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వర్చువల్‌గా నిర్వహించిన బిర్సా ముండా జయంత్యుత్సవాలను జిల్లా కేంద్రంలోని రైతువేదిక నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, గిరిజన సంఘా ల నాయకులు, పటేళ్లు, సర్‌మేడిలు, అధికారులు, విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా బీర్సా ముండా చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బిర్సా ముండా 25ఏళ్ల వయస్సులో గిరిజన హక్కు ల కోసం బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడారని కొ నియాడారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ దివస్‌గా బిర్సా ముండా జయంతిని ప్రకటించిందని తెలిపారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆదివా సీ గిరిజన నాయకులను శాలువాలతో సన్మానించా రు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్, జిల్లా సర్మేడి మెస్రం దుర్గు, డీడీ అంబాజి, జీసీసీ డీఎం సందీప్, ఈఈ తానాజి, జేడీఎం నాగభూషణం, ఏటీడీవో సదానందం, మెస్రం మనోహర్, మాజీ ఎంపీపీ జైవంత్‌రావు, నాయకులు మర్సోకోల తిరుపతి, పెందూర్ ప్రభాకర్, కుడ్మెత తిరుపతి, పెందూర్ దాదీరావు, పుర్క బాబురావు, పెందూర్ పుష్పారాణి, బొంత ఆశారెడ్డి పాల్గొన్నారు.


