ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏటీడీవో
ఎఫెక్ట్..
దహెగాం: మండలంలోని కల్వా డ ఆశ్రమ పాఠశాలను శనివారం ఏటీడీవో శ్రీనివాస్ సందర్శించారు. శనివారం ‘సాక్షి’లో ‘చన్నీటి గజ గజ..!’ ప్రత్యామ్నా య చర్యలేవి..?’ శీర్షిక ప్రచురించిన కథనానికి స్పందించారు. ఏటీడీవో శ్రీనివాస్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కొప్పుల ప్రశాంత్ చెట్టు పైనుంచి పడి రెండు కాళ్లు విరగగా ఘటన వివరాలు సేకరించారు. శాఖాపరమైన చర్యలకు ఐటీడీఏ పీవోకు నివేదిక అందిస్తానని పేర్కొన్నారు. ముందుగా పాఠశాల పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశా రు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. స్థానికంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చలి తీవ్రత ఉన్నందున కట్టెల పొయ్యి లేదా గ్యాస్ పొయ్యిపై నీళ్లు వేడి చేసి విద్యార్థుల స్నానాలకు అందించాలని సూచించారు.
ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏటీడీవో


