గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రంథాలయాల అభివృద్ధికి చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి 58వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పోటీ పరీక్షలకు హాజ రయ్యే వారికి అవసరమైన మెటీరియల్, పాఠకుల కోసం దినపత్రికలు, వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, లైబ్రేరియన్లు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.


