అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
వాంకిడి: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డ్, రైటర్ రూంలు పరిశీలించారు. ఎస్‌హెచ్‌వో మహేందర్‌ను అడిగి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. పెండింగ్ కేసులు, వాటి పరిష్కార మార్గాలు సూచించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించి, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.


