రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. పాఠశాల ఆవరణలో శుక్రవారం పీడీ షౌజియాతో కలిసి విద్యార్థినుల ను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడు తూ ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి లాంగ్ జంప్‌లో అక్ష య, షాట్‌పుట్‌లో స్వర్ణ, కబడ్డీలో కీర్తన, సంధ్యారాణి, ఖోఖోలో హర్షిక, శ్రీదేవి, జయ, వా లీబాల్‌లో వైభవి, భవిష్య, శృతిక సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు.


