ఆసిఫాబాద్‌రూరల్/పెంచికల్‌పేట్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. అడవుల జిల్లాను చలి వణికిస్తుండగా.. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ లోపే నమోదవుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా, పలుచోట్ల విద్యార్థులు చన్నీటితో అవస్థలు పడుతూ కనిపించారు. వేడి నీటిని అందించేందుకు ఒక్కో ఆశ్రమ పాఠశాలలో రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఏళ్లుగా వాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ఎంపికై న తిర్యాణి మండలంలోని ఏడు వసతి గృహాలకు మాత్రమే సోలార్ హీటర్లు మంజూరు చేసినట్లు గిరిజన శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయమే ఎముకలు కొరికే చలిలో చన్నీటితోనే స్నానం చేస్తూ గజ గజ వణుకుతున్నారు. మరికొందరు చలిని తప్పించుకునేందుకు మధ్యాహ్నం స్నానం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వేడి నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నల్లా నీళ్లతో స్నానం
ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్లకు మరమ్మతు చేయాలి. వేడినీళ్లు అందుబాటులో లేక పాఠశాలలోని నల్లాల వద్ద చల్లని నీటితోనే స్నానం చేస్తున్నాం.
– సృజన్ మండల్, పదో తరగతి
గిరిజన ఆశ్రమాల్లో నిరుపయోగంగా సోలార్ వాటర్ హీటర్లు
గిరిజన ఆశ్రమాల్లో నిరుపయోగంగా సోలార్ వాటర్ హీటర్లు
గిరిజన ఆశ్రమాల్లో నిరుపయోగంగా సోలార్ వాటర్ హీటర్లు
గిరిజన ఆశ్రమాల్లో నిరుపయోగంగా సోలార్ వాటర్ హీటర్లు


