ప్రత్యామ్నాయ చర్యలేవి..?
దహెగాం(సిర్పూర్): మండలంలోని కల్వాడ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు ట్యాంకు వద్ద చన్నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇక్కడి సోలార్ హీటర్ నిరుపయోగంగా మారింది. ఆశ్రమ పాఠశాలలో 201 మంది విద్యార్థులు ఉన్నారు. సోలార్ హీటర్‌కు మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వేడినీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.
పట్టించుకోవడం లేదు
ఆశ్రమ పాఠశాలలో ఐదేళ్లుగా సోలార్ హీటర్ పనిచేయడం లేదు. ఏటా చలికాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉదయమే కాలకృత్యాలు, స్నానానికి చల్లటి నీళ్లే దిక్కవుతున్నాయి. బాత్రూంలు సైతం సరిగా లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు.
– వినయ్, కల్వాడ ఆశ్రమ పాఠశాల
చలికి ఇబ్బంది
తరగతులకు సకాలంలో హాజరుకావాలంటే ఉదయం ఏడు గంటలకే స్నానం చేయాలి. చలితో ఇబ్బంది ఉండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నానం చేస్తున్నాం. సోలార్ హీటర్ నిరుపయోగంగా ఉంది.
– అభిలాష్, పదో తరగతి
ప్రత్యామ్నాయ చర్యలేవి..?
ప్రత్యామ్నాయ చర్యలేవి..?


