రెండేళ్లుగా నిరుపయోగం
లింగాపూర్(ఆసిఫాబాద్): లింగాపూర్ మండలంలోని కంచన్‌పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 140 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ రెండేళ్లుగా సోలార్ ప్యానెళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులంతా చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. కొందరు చలికి తట్టుకోలేక మధ్యాహ్నం భోజన సమయంలో స్నానం చేస్తున్నారు.
అంటువ్యాధుల భయం
చలికి చాలా మంది స్నానం చేయడం లేదు. చర్మ సంబంధిత వ్యాధులతోపాటు అంటువ్యాధులు వ్యాపిస్తాయనే భయం ఉంది. అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలి.
– రాజేందర్, 8వ తరగతి
రెండు రోజులకోసారి..
ఏజెన్సీ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది. చల్లటి నీటితో స్నానం చేస్తే జలుబు, జ్వరం వస్తుందేమోనని భయంగా ఉంది. రెండు రోజులకోసారి స్నానం చేస్తున్నాం.
– శివమణి, పదో తరగతి
రెండేళ్లుగా నిరుపయోగం
రెండేళ్లుగా నిరుపయోగం


