నేటి బాలలే రేపటి పౌరులు
ఆసిఫాబాద్‌రూరల్: నేటి బాలలే రేపటి పౌరులని డీసీపీవో మహేశ్ అన్నారు. మండలంలోని తుంపెల్లి పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ, అభివృద్ధికి జిల్లా బాలల సంరక్షణ విభాగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల గురించి వివరాలు తెలిస్తే 1098, 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. వట్టివాగు గిరిజన పాఠశాలలో నిర్వహించిన వేడుకులకు ఏసీఎంవో ఉద్దవ్, జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ పాఠశాలలో వేడుకలు సీనియర్ సివిల్ జడ్జి యువరాజ హాజరయ్యారు.
తుంపెల్లిలో కేక్ కట్ చేస్తున్న డీసీపీవో మహేశ్
నృత్యం చేస్తున్న విద్యార్థినులు
నేటి బాలలే రేపటి పౌరులు


