బతుకుదెరువుకు.. బండెక్కి వచ్చి
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కుమార్.. రాజస్తాన్ నుంచి కూలీలు వస్తున్నారని తెలియగానే ఈయనతోపాటు మంచిర్యాల జిల్లా దేవాపూర్ నుంచి నలుగురు రైతులు కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. కూలీలతో మాట్లాడి పత్తి చేలలో పనిచేసేందుకు ప్రత్యే క వాహనాల్లో దేవాపూర్‌కు తీసుకెళ్లారు.
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధి కరువై సుదూర ప్రాంతాల నుంచి కూలీలు జిల్లాకు తరలివస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంట అధికంగా ఉండగా, కూలీల కొరత వేధిస్తోంది. దీంతో రైతులు వలస కూలీలపై ఆధారపడుతున్నారు. ఇతర రాష్ట్రాల వారిని పిలిపించుకుంటున్నారు. సుమా రు 1,327 కిలోమీటర్ల దూరంలోని రాజస్తాన్‌లోని బోద్‌పూర్ నుంచి ఇటీవల పలువురు కూలీలు ఇక్కడికి పత్తి ఏరేందుకు జిల్లాకు చేరుకున్నారు. ఈ సీజన్‌లో అక్కడ కూలీ దొరకకపోవడంతో పొట్టచేతిన పట్టుకుని కుటుంబంతో వలస వచ్చారు. సుమారు నాలుగు నెలలపాటు పత్తితీత పనుల్లో నిమగ్నం కానున్నారు.
రైలు మార్గాన జిల్లాకు..
రాజస్తాన్ నుంచి కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు కూలీలు రైలు మార్గాన చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, దహెగాం, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌తోపాటు మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. వీరి రవాణా ఖర్చులను స్థానిక రైతులే భరిస్తున్నారు.
బతుకుదెరువుకు.. బండెక్కి వచ్చి


