డిజిటల్ లిటరసీపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసీపై అవగాహన అవసరమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులకు గురువారం ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్ టూల్స్‌పై శిక్షణను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గణితంతో కోడింగ్, డాటా సైన్స్, భౌతిక శాస్త్రంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి అంశాలను బోధించాలన్నారు. మూడు రోజు లపాటు కొనసాగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు శ్యాంసుందర్, శ్రీనాథ్, రవికుమార్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


