నాణ్యమైన బొగ్గు అందిస్తేనే లాభాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): వినియోగదారుల నమ్మకాని కి అనుగుణంగా నాణ్యమైన బొగ్గును అందించినప్పుడే సింగరేణికి లాభాలు చేకూరుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహించారు. జీఎం కార్యాలయ ఆవరణలో నా ణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు. జీఎం మాట్లాడు తూ సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తితోపాటు నా ణ్యత ఎంతో కీలకమన్నారు. బొగ్గులో రాళ్లు, సేల్ బొగ్గు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు, అధికారులతో కలిసి నాణ్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, అధికారుల సంఘం నాయకుడు ఉజ్వల్‌కుమార్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పీవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


