ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని తేలిగూడ, అంకుసాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, ఏఐ బోధన తీరు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించా రు. ఆయన వెంట విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


