రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల నుంచి వివిధ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన 20 మంది క్రీడారులను గురువారం డీఎస్‌వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లతో కలిసి పాఠశాల ఆవరణలో అభినందించారు. డీఎస్‌వో మాట్లాడుతూ ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్– 14, 15, 16 అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాపాఠశాల నుంచి 20 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, ఏసీఎంవో ఉద్దవ్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్‌లు అరవింద్, తిరుమల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


