అట్టహాసంగా జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్‌స్థాయి అండర్– 19 నెట్‌బాల్ బాలబాలికల ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. డీఐఈవో రాందాస్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం నెట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా సెక్రెటరీ బాబురావు మాట్లాడుతూ జోనల్‌స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది బాలురు, 30 బాలికలు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. ఈ నెల 15 నుంచి 17వరకు వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, పీడీ, పీఈటీలు తిరుపతి, సందీప్, మహేందర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.


