విద్యార్థులను ప్రాక్టికల్స్‌కు సన్నద్ధం చేయాలి
● డీఐఈవో రాందాస్
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రాక్టికల్స్ పరీక్షల కోసం ఇంటర్మీడియెట్ విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి(డీఐ ఈవో) రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీని బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, కళాశాల రికార్డులు పరిశీలించారు. రా నున్న ప్రాక్టికల్స్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. సకా లంలో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు క్ర మం తప్పకుండా కళాశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి కేజీబీవీలో మొక్కలు నాటారు.


