వాతావరణం
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలితీవ్రత పెరుగుతుంది. పొగమంచు కురుస్తుంది.
సమయపాలనపై పట్టింపేది?
దహెగాం: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ‘సాక్షి’ విజిట్ చేయగా, ఉదయం పది గంటలకు కేవలం స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా సిబ్బంది రాలేదు. మందులు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు కేవలం ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ వైద్యాధికారి కూడా ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే విధులకు హాజరవుతుందని రోగులు చెబుతున్నారు. 2018 నుంచి రెగ్యులర్ వైద్యులు లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. అలాగే నలుగురు స్టాఫ్ నర్సులకు ఒక్కరే ఉన్నారు. మిగిలిన సిబ్బంది దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమయపాలన పాటించడం లేదు. ప్యూరిఫైడ్ పనిచేయకపోవడంతో రోగులకు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
బెజ్జూర్: స్థానిక పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్ నర్సులకు ప్రస్తుతం ఒక్కరు కూడా రెగ్యుల ర్ లేరు. ఇన్‌చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ఇద్దరు వైద్యులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వైద్యాధికారులు పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వాష్‌రూమ్స్ సక్రమంగా లేవు. కిటికీలన్నీ ఊడిపోతున్నాయి.
వాతావరణం


