పెద్దదిక్కు.. కాగజ్‌నగర్ సీహెచ్‌సీ
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి డివిజన్ పరిధిలోని రోగులకు పెద్దదిక్కుగా మారింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ పెషెంట్లను పరీక్షించి మందులు అందించారు. జనరల్ ఫిజిషియన్ అరుణ్, చిల్ట్రన్స్ డాక్టర్ మహేశ్, ఎంబీబీఎస్ జనరల్ వైద్యులు శ్రీధర్, సాత్విక్, విజయ్ కుమార్‌లు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకుని రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు సాధారణ వైరల్ ఫీవర్, వాతావరణ మార్పులతో దగ్గు, తదితర సమస్యలతో వచ్చారు. దహెగాం ఆస్పత్రి నుంచి వచ్చిన గర్భిణులు స్కానింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
వంద పడకలుగా
అప్‌గ్రేడ్ చేస్తున్నాం
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పీహెచ్‌సీల నుంచి రెఫర్‌పై వచ్చిన గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్నాం. 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు అనుమతులు వచ్చాయి. పురాతన భవనం కూల్చి వంద పడకలకు వసతులు కల్పించేందుకు పనులు కొనసాగుతున్నాయి.
– అవినాష్, సూపరింటెండెంట్,
కాగజ్‌నగర్ సీహెచ్‌సీ


