కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వం ఏర్పాటు చేసే వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, కొమురవెళ్లి, ఎడవెల్లి, ఇందిరానగర్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు బుధవారం స్థలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతీ కేంద్రంలో గోనె సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ట్యాబ్‌లు, టార్పాలిన్‌లు సమకూర్చామని, రైతు లకు సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి తనిఖీలు చేపడుతామన్నారు. కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో తరలించాలన్నారు. డీఆర్‌డీవో దత్తారావు, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, ఏపీఎం దుర్గయ్య, ఆర్‌ఐ ఉదయ్ పాల్గొన్నారు.


