రెబ్బెనలో సిబ్బంది కొరత
రెబ్బెన: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజువారీగా ఓపీ 70 నుంచి 80 వరకు ఉండగా.. సీజనల్ వ్యాధుల సమయంలో 150 వరకు ఉంటుంది. ఒకే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ఆయన లేని సమయంలో స్టాఫ్ నర్సులే దిక్కవుతున్నారు. స్టాఫ్‌నర్స్ పోస్టు సైతం ఒక్కటే ఉంది. డిప్యూటేషన్‌పై అదనపు స్టాఫ్‌నర్సుతో నెట్టుకొస్తున్నారు. పగలు ఒకరు, రాత్రి మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు, ఇతర సలహాలు, సూచనలు అందించేందుకు 12 మంది ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా కేవలం 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు త్వరలో డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్లనున్నారు. ఆర్వో ప్లాంటు మాత్రం మరమ్మతులు లేక నిరుపయోగంగా ఉంది. ఆస్పత్రి ప్రథమ చికిత్స సేవలకే మాత్రమే పరిమితం కావడంతో.. సీరియస్ కేసులను బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు అందించాల్సిన ఇంజక్షన్లు సరిపడా లేవు. తిర్యాణి మండలం రొంపల్లి పీహెచ్‌సీ నుంచి తెప్పిస్తున్నారు.


