ఇళ్లు మంజూరు చేయాలి
కేంద్ర ప్రభుత్వ జన్‌మన్ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని జైనూర్ మండలం పానపటార్ గ్రామానికి చెందిన ఆత్రం జానబాయి, సిడాం రంబుబాయి, ఆత్రం సోనుబాయి కోరారు. పక్కా గృహాలు లేకపోవడంతో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులైన తమను ఆదుకోవాలని విన్నవించారు.
అధికారులు అడ్డుకుంటున్నారు
‘కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో పలువురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మేము వంశపారపర్యంగా సాగు చేసుకుంటున్న భూమిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే అటవీ భూమి అని ఆశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి..’ అని సార్సాల గ్రామానికి చెందిన రత్నం గణపతి, దేవదాస్, సౌజన్య, మీన కోరారు.
ఇళ్లు మంజూరు చేయాలి


