ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సరిహద్దుల నుంచి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోళ్లకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, డీఏవో వెంకటి, డీఆర్‌డీవో దత్తారావు, ఆర్‌టీవో రాంచందర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


