కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన: సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలపై యాజ మాన్యం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ గోలేటి శనివారం టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదు ట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించా రు. అనంతరం జీఎం విజయభాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి గతంలో మాదిరిగా అనారోగ్యంతో బాధపడే కార్మికులను ఇన్‌వ్వాలిడేట్ చేయాలని సూచించారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మారుపేర్లతో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టి పెండింగ్‌లో ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించాలని, డిస్మిసల్ ఉద్యోగులకు ఒకసారి ఉద్యోగావకాశం కల్పించాల ని కోరారు. డిసిప్లీనరీ చర్యల కోసం 150 మస్టర్లు చేయాలనే సర్క్యులర్‌ను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను తక్షణమే నిర్వహించాలని కోరారు. ఓవర్‌మెన్ పాస్ అయిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు, డిప్లొమా హో ల్డర్లకు ఓవర్‌మెన్ ప్రమోషన్ కల్పించాలని కోరారు. గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర పనులు త్వరగా పూర్తి చేసి ఓసీపీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, రాజేశ్, ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్‌బాబు, నాయకులు ఓదెలు, అంజయ్య, ఆఫ్రిద్, షకీల్, రారాజు, గోపాల్, రవికుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


