నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది
బాసర: భక్తులు పోగొట్టుకున్న గోల్డ్ రింగ్, మొబైల్, నగదు, హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించి భక్తులకు అప్పగించి ఆలయ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. శుక్రవారం హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇద్దరు వేర్వేరు భక్తులు కుటుంబ సమేతంగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆలయం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తురాలు సావిత్రి బాయి మొబైల్ తో పాటు రూ.1000 నగదు, హ్యాండ్ బ్యాగ్‌ను మర్చిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ అనే మరో భక్తుడు అక్షరాభ్యాస మండపంలో విలువైన తన గోల్డ్ రింగ్‌ను పోగొట్టుకున్నాడు. విధులు నిర్వహిస్తున్న ఆలయ వాగ్దేవి సొసైటీ సిబ్బంది రాజు, హోంగార్డు ఇందల్ నారాయణ పోగొట్టుకున్న వాటిని గుర్తించి నిజాయితీతో ఆలయ ఇన్స్‌స్పెక్టర్ సురేశ్‌కు అందజేశారు. ఆయన భక్తులను పిలిపించి తిరిగి వారికి అప్పగించారు.


