విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
సోన్: మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 2025 –26 సంవత్సరానికి గాను 11వ జోనల్ స్థాయి పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి, మండల బీజేపీ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, జమాల్, ఉదయ్, సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


