ఉత్సాహంగా ఫుట్‌బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్టలోని హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన అండర్ –17 జోనల్‌స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొనగా ప్రతిభ చాటిన పలువురిని ఎంపిక చేశారు. ఎంపికై న బాలబాలికల జట్లు త్వరలో నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాల్‌విగ్, వెంకటేశ్, రేని రాజయ్య, దుబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


