చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు మంద భీమయ్య(70) ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కాసిపేట ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. భీమయ్య భార్య 13 సంవత్సరాల క్రితం చనిపోగా అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈనెల 4న సాయంత్రం 7గంటలకు తాగిన మత్తులో గడ్డి మందు తాగటంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ 6న సాయంత్రం మృతి చెందాడు. శుక్రవారం భీమయ్య అన్న మంద పోషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


