ఫిడే వరల్డ్ చెస్ కప్ ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) గ్రామ వాసి గాడి అరుణ్ కుమార్ ఫిడే వరల్డ్ చెస్ కప్ –2025కి ఆర్బిటర్ (నిర్ణేత)గా ఎంపికయ్యారు. నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్‌కు గోవాలో భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు తెలంగాణ నుంచి ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సార్జెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ కామన్వెల్త్ చెస్ చాంపియన్ షిప్ ఆర్బిటర్‌గా చేశారు.


