గంజాయి మొక్కలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గంజాయి మొక్కలు స్వాధీనం

Nov 8 2025 7:42 AM | Updated on Nov 8 2025 7:42 AM

గంజాయ

గంజాయి మొక్కలు స్వాధీనం

కెరమెరి: మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీ కోటా గ్రామంలో గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్‌. మధుకర్‌ తెలిపారు. నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం కోటాలో తనిఖీలు చేపట్టగా గాయక్‌వాడ్‌ శివా జీ తన పొలంలో సాగు చేస్తున్న 28 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి ఖరీదు రూ.2.80 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

గంజాయి మొక్క పెంచుతున్న

మహిళపై కేసు..

నస్పూర్‌: పట్టణ పరిధిలోని ఆర్‌కే 5 కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో నిషేధిత గంజాయి మొక్క పెంచుతున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. శుక్రవారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సీసీసీలోని ఆర్‌కే 5 కాలనీ క్వార్టర్‌ నంబర్‌ డి –216లో నివాసం ఉండే సల్లూరి శంకరమ్మ తన బంధువైన ఎండీ ఖయ్యూమ్‌ సోను సహకారంతో ఇంటి ఆవరణలో నిషేధిత గంజాయి మొక్క పెంచుతోంది. అందిన సమాచారం మేరకు మొక్కను స్వాధీనం చేసుకుని శంకరమ్మపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొక్క విలువ సుమారు రూ.10,000 ఉంటుందన్నారు. రెండో ఎస్సై జితేందర్‌, ఏఎస్సై శకుంతల, కానిస్టేబుళ్లు బ్రహ్మచారి, ఉషారాణి, మల్లేశ్‌, శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వివాహిత మృతిపై ఫిర్యాదు

మందమర్రిరూరల్‌: వివాహిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి అన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంగడిబజారుకు చెందిన పద్మ(35)కు హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం సాయిపేటకు చెందిన గుడికందుల రాజుతో 2018లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వారు మందమర్రిలోని అంగడిబజార్‌లోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐదు నెలల క్రితం పద్మ, రాజు తమ కుమారుడితో కలిసి సాయిపేటకు వెళ్లారు. ఈనెల 1న భార్య పద్మ, కుమారుడితో మందమర్రికి వచ్చిన రాజు భార్య ఆరోగ్యం బాగాలేదని చెప్పి వారిని ఇక్కడే వదిలి వెళ్లాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పద్మను కుటుంబసభ్యులు మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ఉదయం తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందింది. అయితే పద్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతిపై దర్యాప్తు జరపాలని మృతురాలి అన్న సదానందం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గంజాయి మొక్కలు స్వాధీనం1
1/1

గంజాయి మొక్కలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement