ఆర్జీయూకేటీలో వందేమాతరం ఆలాపన
బాసర: ఆర్జీయూకేటీ, బాసరలో 150వ వందేమాతర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ వందేమాతరం కేవలం గేయం కాదని అదొక మహా సంకల్పమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కాలంలో వందేమాతరం ప్రతీ భారతీయుడిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని రగిలించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పా ల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
దేశాన్ని ఏకం చేసిన గేయం
‘వందేమాతరం‘
ఉట్నూర్‌రూరల్: స్వాతంత్ర ఉద్యమంలో దేశాన్ని ఏకం చేసిన గేయం వందేమాతరం అని ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై గీతాలాపన చేశారు. బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఆర్జీయూకేటీలో వందేమాతరం ఆలాపన


