క్రీడాపోటీల్లో ప్రతిభ చూపాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ క్రీడాపోటీల్లో ప్రతిభ చూపాలని బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో శుక్రవారం డిపార్టుమెంటల్ ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నిత్య సాధనతో క్రీడాకారులు ఆరోగ్యంతోపాటు ఆనందం ఉంటారన్నారు. సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు పోటీల్లో రాణించేందుకు యాజమాన్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. కోల్ ఇండియా పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


