త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ఎకో వంతెనపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎఫ్‌డీపీటీ శాంతారాం అన్నారు. వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో నా లుగు వరుసల జాతీయ రహదారిపై వన్యప్రాణుల సౌకర్యార్థం నిర్మించిన ఎకో బ్రిడ్జిని శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కు మార్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌తో కలిసి పరిశీలించారు. మట్టి నింపే పనులను వెంటనే పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికా రులను ఆదేశించారు. చలికాలంలో ఈ అడవుల గుండా పులులు సంచరించే అవకాశం ఉందన్నారు. మట్టి నింపితే పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా నేరుగా అడవుల్లోకి వెళ్తాయని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్వో గోవింద్‌చంద్ సర్దార్, ఎఫ్‌ఎస్‌వో సతీశ్‌కుమార్, ఎఫ్‌బీవోలు షాహిద్, ఉమారాణి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఉన్నారు.


