హోరాహోరీగా నెట్‌బాల్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/కళాశాలలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 సబ్ జూనియర్ బాలబాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. డీవైఎస్‌వో అశ్వక్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రతిభ చూపి న 12 మంది బాలురు, 12 మంది బాలికల ను జోనల్‌స్థాయికి ఎంపిక చేశామని తెలిపా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్, నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుప తి, యోగి, రాకేశ్, ప్రణీత్, సౌందర్య, వాణి తదితరులు పాల్గొన్నారు.


