స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి వందేమాతరం
ఆసిఫాబాద్: స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం గీతం స్ఫూర్తిగా నిలిచిందని, వందేమాతరం దేశభక్తికి నిర్వచనమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి వందేమాతరం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు.
పోరాట స్ఫూర్తిని రగిలించింది
ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో జాతీయ గేయం వందేమాతరం పోరాట స్ఫూర్తిని రగిలించిందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవా రం సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ వందేమాతరం గేయం దేశభక్తి, ఐక్యత, త్యాగం వంటి విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతీ భారతీయుడు వందేమాతరం గేయాన్ని గర్వంగా ఆలపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ(అడ్మిన్) పెద్దన్న, ఆర్‌ఐ(ఎంటీఓ) అంజన్న, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, కార్యాలయ, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆలపిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులు
గీతాలాపన చేస్తున్న ఎస్పీ కాంతిలాల్ పాటిల్
స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి వందేమాతరం


