చివరికి ప్రైవేటుకే..
సీసీఐకి విక్రయిస్తే మద్దతు వస్తుందని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. మిల్లుకు వచ్చిన సుమారు 30 వాహనాలను సీసీఐ అధికారులు పరిశీలించగా 5 నుంచి 7 వాహనాల్లోని పత్తిలో మాత్రమే 12 శాతం కంటే తక్కువ తేమను చూపించింది. మిగిలిన వాహనాల్లో 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నట్లు గుర్తించారు. దీంతో తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయలేదు. సాయంత్రం వరకైనా కొనుగోలు చేస్తారని రైతులు ఎదురుచూశారు. చివరికి ప్రైవేటు వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి తక్కువ రేటుకు అమ్ముకున్నారు.
సాయంత్రం వరకు వేచి చూశా..
సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిసి స్లాట్ బుకింగ్ చేసుకున్నా. ఓ ప్రైవేటు వాహనం కిరాయికి మాట్లాడుకుని సుమారు 12 క్వింటాళ్ల పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చా. అధికారులు పత్తిలో 16 శాతం తేమ వస్తుందని కొనలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రైవేటుకు విక్రయించా. పత్తితీత సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలి.
– మస్నే విమల, ఖమాన, మం.వాంకిడి
చివరికి ప్రైవేటుకే..


