గంజాయి తరలిస్తున్న ఒకరి రిమాండ్
పెంబి: మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన మేగవత్ వినోద్ ఎండిన గంజాయిని ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌కు బైక్‌పై తీసుకువస్తుండగా కొండాపూర్ వంతెన వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. 1.710 కిలోల ఎండు గంజాయి, ద్విచక్రవాహనం, చరవాణిని స్వాధీనం చేసుకోని నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలోఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్, సిబ్బంది వెంకటేష్, హరీష్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ ఎంపిక పోటీలు
దండేపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అండర్–14 వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. మంచిర్యాల జట్టు ప్రథమ, ఆదిలాబాద్ జట్టు ద్వితీయ, నిర్మల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఎంఈవో మంత్రి రాజు, టోర్నమెంట్ పరిశీలకులు ఫణిరాజా, పాఠశాల పీడీ శ్రీనివాస్, వివిధ పాఠశాలల పీఈటీలు, పీడీలు కార్తీక్, సత్యనారాయణ, మనోహర్, కోచ్ కార్తీక్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.


