నెలాఖరులోగా చేపపిల్లలు వదలాలి
ఆసిఫాబాద్: నెలాఖరులోగా చెరువుల్లో చేపపిల్లలు వదలాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరి శ్రమ శాఖ, క్రీడాయువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధి కారులు, కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూట్‌మ్యాప్ రూపొందించుకుని ప్ర ణాళికాబద్ధంగా పంపిణీ చేయాలన్నారు. చేపల రిటైల్ మార్కెట్‌కు అనువైన స్థలాలు గుర్తించాలన్నా రు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో 261 చెరువులు, రిజర్వాయర్, పెద్ద చెరువులను గుర్తించామని, ఈ నెలాఖరులోగా అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. చిన్న చెరువుల్లో 66 లక్షల పిల్లలు, 30 నుండి 40 మిల్లీ మీటర్ల సైజు, పెద్ద చెరువులు, రిజర్వాయర్ల్‌లో 78 లక్షల పిల్లలు, 80 నుండి 100 మిల్లీ మీటర్ల సైజు పిల్లలు వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, డీపీవో భిక్షపతి, ఇరి గేషన్ ఈఈ గుణవంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, తదితరులు పాల్గొన్నారు.


