బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు.
మహిళల రక్షణకు తొలి ప్రాధాన్యత
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్నపిల్లల రక్షణకే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు తమ సమస్యలపై నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. షీటీంల ద్వారా చిన్న పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత నెలలో 87 ప్రదేశాలను గుర్తించి 22 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 16 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. అత్యవసర సమయాల్లో ఆసిఫాబాద్ షీటీం 8712670564, కాగజ్‌నగర్ షీటీం 8712670565 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


