తేమతో సంబంధం లేకుండా పత్తి కొనాలి
కెరమెరి: ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని కొలాం సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిడాం భీంరావు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు వ్యాపారులు తమ ఇష్టం వచ్చిన ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు అయ్యే ధర ప్రకటించా లని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మడావి భరత్ భూషణ్, పంద్రం య శ్వంత్‌రావు, అడ ఆనంద్, కుర్సెంగ యాదోరావు, టేకం భీంరావు, తదితరులు పాల్గొన్నా రు.


