వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి
దహెగాం: జిల్లాలోని రైతులు వ్యవసాయ యాంత్రికరణ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంక టి అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు లగ్గాం తదితర గ్రామాల్లో వరి, పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం మండ ల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రైతులకు 50 శాతం, పురుషులకు 40 శాతం సబ్సిడీపై పనిముట్లు అందించనున్నట్లు తెలిపారు. రైతులు పట్టా పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ధాన్యం కొనుగోలు కోసం స్థలాలను పరి శీలించారు. పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏవో రామకృష్ణ, సీఈవో బక్కయ్య, సిబ్బంది ఉన్నారు.


