ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజా సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు చేస్తోందని జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్‌లోని లుథియానా పట్టణంలో 1980 నవంబర్ 1, 2, 3 తేదీ ల్లో జరిగిన మహాసభల్లో డీవైఎఫ్‌ఐ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సభ్యత్వం కలిగిన యువజన సంఘం అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, సతీశ్, పురుషోత్తం, నిఖిల్, వంశీ, శివ, లక్ష్మణ్, కృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.


