సైబర్‌ ఎటాక్‌! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ ఎటాక్‌!

Nov 2 2025 9:30 AM | Updated on Nov 2 2025 9:30 AM

సైబర్‌ ఎటాక్‌!

సైబర్‌ ఎటాక్‌!

● ఆన్‌లైన్‌లో పెట్టుబడుల పేరుతో మోసం ● అత్యాశకుపోయి సొమ్ము పోగొట్టుకుంటున్న వైనం ● జిల్లాలో పెరుగుతున్న బాధితులు

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో ప్రతీరోజు ఏదో ఒకచోట సైబర్‌ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఇన్‌స్టెంట్‌లోన్‌లో పేరుతో సైబర్‌ నేరగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. సైబర్‌ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో బాధితులు లక్షల్లో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. చదువుకున్న వారితో పాటు అమాయకులను ఆసరా చేసుకుని సైబర్‌ మోసాలకు పాల్ప డుతున్నారు. పోలీసులు అడపాదడపా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ అత్యాశకు పోయిన బాధితులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఈ ఏడాది 288 ఫిర్యాదులు

జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఈ ఏడాది 288 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో 33 కేసులు నమోదయ్యాయి. పలువురు బాధితులు రూ.1,96,104,76 నగదు నష్టపోయారు. వివిధ కేసుల్లో పోలీసులు రూ.14,77,310 ఫ్రీజ్‌ చేశారు. 25 కేసులకు సంబంధించి రూ.4,52,780 నగదు రికవరీ చేశారు. జిల్లాలో సైబర్‌ క్రైం మోసాలకు పాల్పడిన 6 కేసుల్లో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్‌ చేశారు.

అధికలాభాలు పొందవచ్చని..

ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపించి వాట్సాప్‌ గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఒకరి వద్ద నుంచి రూ.30 వేలు పెట్టుబడులు పెట్టించారు. ఇదే తరహాలో వర్మాస్‌బుక్‌ డిస్కషన్‌, అలయన్స్‌ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియేట్‌ చేసి 108 మందిని సభ్యులుగా చేర్చారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేల చొప్పున రూ.లక్షల్లో వసూలు చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబర్‌ మోసానికి గురైనట్లు గ్రహించిన కాగజ్‌నగర్‌కు చెందిన ఒకరు జూలై 5న పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న అహ్మదాబాద్‌కు చెందిన అశోక్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. 26 ట్రాన్‌సెక్షన్స్‌ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్‌ చేసినట్లు గుర్తించారు.

అవగాహన కల్పిస్తే..

సైబర్‌ మోసాలపై వ్యాపారులు, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. రెట్టింపు డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసాలకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను ఎంచుకోవాలని పోలీసులు పూర్తిస్థాయిలో వ్యాపారస్తులు, ఉద్యోగులకు అవగాహన కల్పిస్తే కొంత మేరకై నా సైబర్‌ నేరాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

అత్యాశకు పోయి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టవద్దు. ఇతరులకు ఎలాంటి సందర్భంలో కూడా ఆధార్‌, బ్యాంక్‌, పాన్‌కార్డు వివరాలను చెప్పవద్దు. ప్రజల బలహీనతలే సైబర్‌ మోసగాళ్లకు బలంగా మారుతున్నాయి.సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు ఫిర్యాదు చేయాలి.

– కాంతిలాల్‌ పాటిల్‌, ఎస్పీ

ఆన్‌లైన్‌ ఆఫర్లను నమ్మి..

ఆన్‌లైన్‌లో ఆఫర్లను నమ్మి మోసపోతున్న బాధితుల సంఖ్య జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. సైబర్‌ నేరాలకు పాల్పడిన నిందితులను కా గజ్‌నగర్‌ డివిజన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి తన ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలను అప్‌లోడ్‌ చేశాడు. ఖాతా నుంచి రూ.45,790 కోల్పోయినట్లు గ్రహించి ఆ గస్టు 16న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శాడు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్‌ కుమార్‌ దోహార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో ఆశిష్‌ కుమార్‌ దోహార్‌కు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఆకాశ్‌ అద్వానికి పరిచయమయ్యాడు. ఆశిష్‌ కుమార్‌ అధ్వాని బ్యాంక్‌ఖాతా వివరాలు తీసుకుని నెలకు రూ.10వేల చొప్పున జమ చేస్తానని, ఇందుకు గాను నీ ఖాతాను తా ను ఆన్‌లైన్‌లో వాడుకుంటానని పేర్కొనడంతో ఆశిష్‌ కుమార్‌ అంగీకరించాడు. అతని బ్యాంక్‌ ఖాతాతో బిజినెస్‌ అకౌంట్‌ తయారు చేసి ఆశిష్‌ కిరాణ స్టోర్‌ అనే పేరుతో ఖాతాపై ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేశాడు. పలుమార్లు ఈ ఖాతాతోనే ఆన్‌లైన్‌లో తన కార్యకలాపాలను కొనసాగించాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసులు ఖాతాదారుని పట్టుకోవడంతో పాటు ఖాతాలోని రూ.34,530 ఫ్రీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement