రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమావేశం నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారీగా నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.


