
కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు వద్దు
వాంకిడి: టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు నిర్ణయం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం దినకర్, కొలాం సంఘం జిల్లా అ ధ్యక్షుడు ఆత్రం జలపతి డిమాండ్ చేశారు. జీవో 49కి నిరసనగా శనివారం మండలంలోని లింబు గూడలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. గిరి జనులు, గిరిజనేతర పేదలను ‘జల్.. జంగల్.. జమీన్’కు దూరం చేయాలనే కుట్రతోనే జీవో 49 తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు రేవంత్‌రెడ్డి సర్కార్ తలవంచి ఈ చట్టా న్ని తీసుకువచ్చినట్లు విమర్శించారు. ఈ చట్టం అ మలైతే జిల్లాలోని 339 గ్రామాలకు మనుగడ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంజేశారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని ప్రాంతం భారత రాజ్యాంగంలో ని ఐదో షెడ్యుల్‌లో ఉన్నందున జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ, స్థానిక గిరిజనుల అభిప్రాయాల సేకరణ, పెసా చట్టం అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా రా జ్యాంగ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని ఆ రోపించారు. పులులు, అడవుల సంరక్షణ పేరిట గ్రామాలను ఖాళీ చేయించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జాడి తిరుపతి, ఆత్రం దేవ్‌రావు, సీడం జైతు, ఆత్రం మారు, లక్ష్మణ్, భీంరావు పాల్గొన్నారు.