నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్దగల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మూడో రోజు రసవత్తరంగా సాగాయి. శనివారం క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. అండర్ 19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ముఖ్యఅతి థిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, నిర్మల్ అర్బన్ ఎమ్మార్వో రాజు, మున్సిపల్ డీఈ హరిభూవన్, మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్ గౌడ్, నందకుమార్ పాల్గొన్నారు.